calender_icon.png 27 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్‌కు జాతీయస్థాయి గుర్తింపు

27-09-2025 02:16:23 AM

  1. జాతీయస్థాయిలో మూడు ర్యాంకులు
  2. వినూత్న కార్యక్రమాలతో విజయాలు సాధించిన కలెక్టర్

నిర్మల్ సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా గత కొన్ని రోజులుగా జాతీయ, రాష్ర్ట స్థాయిలో ఎన్నో గొప్పగొప్ప అవార్డు లు సాధిస్తూ వస్తుంది. జిల్లా ఖ్యాతి దేశవ్యాప్తంగా విరాజిల్లుతుంది. జిల్లా ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరుతో ఎంతో గొప్ప పేరు సంపాదిస్తూ, ఎన్నో అవార్డులు, రివార్డులు సొంత చేసుకుంటుంది.

దీనంతటికి జిల్లా అధికారుల కార్యదీక్షనే కారణం. ముఖ్యంగా ఏడాది కాలంలో మూడు రంగాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి. జల్ సంచాయ్ - జన భాగిధారి, పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాలు, బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు జిల్లాకు దక్కడం గర్వించదగ్గ విషయం.

జల్ సంచాయ్ జన భాగిధారి..

భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా చేపట్టిన జల్ సంచాయ్ జన భాగిధారి కార్యక్రమంలో భాగంగా తీసుకున్న చర్యలకు గా ను నిర్మల్ దేశవ్యాప్తంగా అపార ఖ్యాతి గడించింది. వర్షపు నీటి సంరక్షణ, మెరుగైన ప్రజ ల భాగస్వామ్యంలో  భాగంగా నిర్దేశించిన అన్ని పనులు పకడ్బందీగా పూర్తిచేసినందుకు గాను కేటగిరి - 2లో జిల్లాకు జాతీయ స్థాయిలోనే రెండో ర్యాంకు సాధించి, కోటి రూపాయల నగదు బహుమతి సొంతం చే సుకుంది. ఇది జిల్లాకు ఎంతో గర్వకారణం. 

జల సంరక్షణలో  భాగంగా చెరువులు, వాగులు, వానజలాల హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, చెక్‌డ్యాంల నిర్మాణం, వాటికి మరమ్మత్తులు చేపట్టి, భూగర్భజలాలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా ఉన్నతాధికారుల మెప్పు పొందాయి. ఈ కార్యక్రమాల లో ప్రజలను ప్రత్యక్ష భాగస్వాములను చేయడంతో ఈ విజయం సొంతమైంది. 

పెంబి ఆస్పిరేషన్ బ్లాక్..

ఇటీవలి నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా పెంబి బ్లాకు జాతీయస్థాయిలో నాలుగవ స్థానంలో నిలిచినం దుకు కాంస్య పతకం లభించింది. దీంతో జిల్లా పేరు మరొక్కసారి దేశవ్యాప్తంగా ఖ్యా తిని గడిచింది. నీతి అయోగ్ యాస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభు త్వం దేశంలోనే అత్యంత వెనుకబడిన 500 మండలాలను ఎంపిక చేసింది. జిల్లాలోని పెంబి బ్లాకు ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో ఒక బ్లాకుగా ఎంపికైంది.

వెనుకబడిన ప్రాం తాల అభివృద్ధి ధ్యేయంగా ఎంపిక కాబడిన పెంబి బ్లాకులో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సూచనలతో అధికారులంతా ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికై కృషి చేశారు.  సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా. మూడు నెలలపాటు అభివృద్ధి కార్యక్రమాలు య జ్జంలా నిర్వహించారు. వ్యవసాయ, వైద్య, విద్యా, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ, తదితర శాఖల అధికారులు త్రైమాసిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం విషయాలలో విప్లవాత్మక మార్పు లు వచ్చాయి. 

ఉత్తమ పర్యాటక ప్రాంతంగా..

ఉత్తమ హస్తకళల విభాగం, బెస్ట్ టూరిస్ట్ విలేజ్‌గా నిర్మల్ జిల్లా నిలిచింది. 2024 సెప్టెంబర్ 27న, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో పర్యాటక రంగానికి సంబంధించి ఉప రాష్ర్టపతి జగదీప్ ధన్కడ్, పర్యా టక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.

కొయ్య బొమ్మల పునరుజ్జీవనానికి, హస్తకళలు కాపాడేందుకు అధికారులు చేపట్టిన చర్యలకు గాను బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అవార్డు లభించింది.  రాష్ర్టస్థాయిలోనూ నిర్మల్ జిల్లా పలు శాఖల పనితీరులో ఉత్తమ స్థానంలో నిలు స్తూ వచ్చింది. 

జిల్లాకు గర్వకారణం..

‘గడిచిన ఏడాది కాలంలో జిల్లాలోని వివిధ శాఖల్లో చేపట్టిన పనులకు మూడు రంగాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు లభించాయి. ఇది జిల్లా అధికారుల కృషి, నిబద్ధతకు నిదర్శనం. జిల్లా చరిత్రలో మైలురాయి. పలు రంగాల్లో ఎన్నో విజయాలు సాధించేలా ప్రోత్సహించిన జిల్లా గత ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రస్తుత జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుల  ప్రోత్సాహం మరువలేనిది. 

వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి..

జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అభిలాష అభినవ్ నిర్మల్ జిల్లాలో వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తూ, యంత్రాంగాన్ని సమిష్టిగా నడిపిస్తూ ప్రభుత్వ పథకాల ను క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా బాలికల భద్రత, ఆర్థిక భరోసా, అక్షరాస్యత, ఆరోగ్యం, వంటి కార్యక్రమాలను అమలుచేసి మంచి ఫలితాలు సాధించారు. నిర్మల్ చరిత్రను తరతరాలకు అందించేందుకు ఐదు రోజు లపాటు ఇక్కడి చరిత్ర, ప్రాచీన కట్టడాలు, కవులు, సంప్రదాయం, సంస్కృతి, ఆచార వ్యవహారాలపై వేడుకలను నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నారు.

ఈ విజయం జిల్లా ప్రజలు, అధికారులదే..

కొయ్య బొమ్మల తయారీ పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలకు నిర్మల్ జిల్లా బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డును సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో అవార్డులు, రివార్డులు జిల్లాకు లభించడం సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో మరిన్ని రంగాల్లో జాతీయస్థాయిలో అగ్రస్థానం సాధించేలా కృషి చేస్తాం. ప్రజలందరినీ అన్ని కార్యక్రమాల్లో విస్తృతంగా భాగస్వామ్యం చేస్తాము. ప్రజలకు, అధికారులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కలెక్టర్ అభిలాష అభినవ్