27-09-2025 01:55:02 AM
తిరుమల, సెప్టెంబర్ 26ః తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడుకొండలవాడు వివిధ వాహనాలపై తిరుమాడ వీ ధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి స్వామివా రు ఉభయ దేవెరులతో ముత్యాల పం దిరి వాహనంపై విహరించారు. తెల్లటి ముత్యాలతో రూపొందించిన నాలుగు స్తంభాలు, శిఖరంతో కూడుకున్న బంగా రు పందిరికి ముత్యాల సరాలు, తోరణా లు, కుచ్చులతో వాహనాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వా మి శ్రీకృష్ణుడి అవతారంలో రుక్మిణీ, సత్యభామలతో కలిసి ముత్యపుపంది రి వాహనంపై భక్తులకు అభయ ప్ర దానం చేశారు. అలగే ఉదయం శ్రీవారి సింహ వాహన సేవ కనులపండువుగా నిర్వహించారు. మలయ ప్ప స్వామివారు సింహ వాహనాన్ని అధిరోహించి యోగముద్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.