calender_icon.png 27 September, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇడ్లీ X సమోసా

27-09-2025 01:27:24 AM

అంతర్యుద్ధమే!

మాపై 5% టాక్స్ వేయడం ఏమిటని ఆవిర్లు చిమ్ముతూ ఇడ్లీ కోపంతో కుతకుతలాడుతున్నది. తినేవాళ్ల వేళ్లు కోసేద్దామా అన్నంత ఆగ్రహంతో దోశ.. పెనంపై వేగుతూ తన అంచులకు పదును పెడుతున్నది. ఉత్తరాది నుంచి ఇవన్నీ గమనిస్తున్న చపాతీ, సమోసాలు ఆనందంగా నవ్వుకుంటున్నాయి. జీరో టాక్స్‌తో అవి చంకలు గుద్దుకుంటున్నాయి. నూనె వేసి.. బాగా కాల్చి తయారుచేసే చపాతీ, పొట్టలో ఆలుగడ్డల్ని దాచుకొని నూనెలో వేగే సమోసాలను ఉత్తరాదివారు జీఎస్టీ నుంచి మినహాయించుకొన్నారు.

‘ఇడ్లీ మీద 5% టాక్సా.. ఇది టాక్స్ కాదు, భావోద్వేగాల బ్లాక్‌మెయిల్’ అని ఓ చెన్నైవాసి ఆక్రోశిస్తున్నాడు. వింధ్య పర్వతాలకు ఆవల, ఈవల బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌పై యుద్ధం మొదలైంది! ఉత్తరాది, దక్షిణాది మధ్య ఇది అంత్యర్యుద్ధంతో సమానం. ౫% స్లాబులో ఇడ్లీ, దోశలు చేరగా ౧౮% స్లాబ్ నుంచి చపాతీలు, రోటీలు, పరాటాలు తంతే బూరెలబుట్టలో పడ్డట్టు జీరో స్లాబ్‌లో పడ్డాయి. ఇది అన్యాయం, అక్రమం అని దక్షిణాది నాస్తాప్రియులు ఆగ్రహిస్తున్నారు.

దేశంలోని అల్పాహారాల మధ్య చిచ్చు పు ట్టింది. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో నాస్తా మధ్య జీఎస్టీ విభజన తెచ్చిం ది! మాపై ౫% టాక్స్ వేయ డం ఏమిటని ఆవిర్లు చిమ్ముతూ ఇడ్లీ కోపంతో కుతకుతలాడుతున్నది. తినేవాళ్ల వేళ్లు కోసేద్దామా అన్నంత ఆగ్రహంతో దోశ.. పెనంపై వేగుతూ తన అంచులకు పదును పెడుతున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉదయం నిద్రలేవగా నే ఇడ్లీ, దోశ అంటూ అరుపులకు కొదవుండదు. లేటైతే ఇంట్లో భార్యలమీద, హోటళ్లలో సర్వర్ల మీద ఈ అరుపులు మరీ ఎక్కువ.

ఇప్పుడు ఇడ్లీ, దోశల మీద 5% జీఎస్టీ భరిస్తున్న కస్టమర్ల కోపానికి అంతేలేదు. ఉత్తరాది నుంచి ఇవన్నీ గమనిస్తున్న చపాతీ, సమోసాలు ఆనందంగా నవ్వుకుంటున్నాయి. జీరో టాక్స్‌తో అవి చంకలు గుద్దుకుంటున్నాయి. నూనె వేసి.. బాగా కాల్చి తయారుచేసే చపాతీ, పొట్టలో ఆలుగడ్డల్ని దాచుకొని నూనెలో వేగే సమోసాలను ఉత్తరాదివారు జీఎస్టీ నుంచి మినహాయించుకొన్నారు. మరి ఇడ్లీ, దోశల మాటేమిటి?.. వా టిపై జీఎస్టీ వేయాలా వద్దా తేల్చుకుందామనుకుంటే, అది చెప్పేవారు బీజీగా ఉండివుంటా రు.

దక్షిణాదివారు అల్పాహారం తీసుకునేప్పుడు చేతివేళ్లకు అంటిన చట్నీలను కూ డా వదలరు. టాక్స్‌ల సంగతి తర్వాత అని వేళ్ల కు అంటిన చట్నీని నాలుకతో కడుపులోకి తో సే పనిలో బీజీగా ఉండివుంటారు. సవరించిన జీఎస్టీ స్లాబులు వచ్చేశాయి. ఇప్పుడు ఎంత వగచితే ఏమీ ప్రయోజనము? ‘ఇడ్లీ మీద ౫% టాక్సా.. ఇది టాక్స్ కాదు, భావోద్వేగాల బ్లాక్‌మేల్’ అని ఉదయం ౭ గంటలకే చెన్నైలో టిఫి న్ లాగిస్తున్న రాజు ఆక్రోశిస్తున్నాడు. మరోవంక వింద్య పర్వతాలకు ఆవల ఢిల్లీలో అదే సమయానికి ప్రియ..

చపాతీ మడతపెట్టి, లాటరీ కొట్టినదానిలా ‘జీరో టాక్స్’ అని పెద్దగా కేకేసింది. ఢిల్లీ వీధుల్లో.. ‘గరం గరం, బంగారం లాంటి సమోసా, టాక్స్‌ఫ్రీ’ అంటూ ఓ దుకాణదారుడు అరుస్తున్నాడు. జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిన ప్రభుత్వాలకు ఈ అరుపులు, కేకలు వినపడేనా? ౫%స్లాబులో ఇడ్లీ, దోశలు చేరగా ౧౮% స్లాబ్ నుంచి చపాతీలు, రోటీలు, పరాటాలు తంతే బూరెలబుట్టలో పడ్డట్టు జీరో స్లాబ్‌లో పడ్డాయి. 

అంతర్యుద్ధమే..

అల్పాహారాల్లో కొన్నింటిపై ౫%  పన్ను విధించటం మరికొన్నింటిని జీరో స్లాబ్ కిందికి తేవడం అల్పాహారప్రియుల మధ్య అంతర్యుద్ధానికి దారితీసింది!. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇడ్లీపై, ఇష్టంగా ఆరగించే దోశపై సుంకాలు ఏమిటని దక్షిణాదివారు గురగురలాడుతున్నారు. ‘మేం ప్రపంచానికి ఐటీ హబ్‌లను ఇచ్చాం, యోగా గురువులను ఇచ్చాం, చనిపోయినవారిని కూడా చటుక్కున లేపగల ఫిల్టర్ కాఫీని ఇచ్చాం. ప్రతిఫలంగా మాకేమిచ్చారు?.. ౫% జీఎస్టీ ఇచ్చారు. ఉత్తర భారతదేశానికి రోటీలు ఫ్రీ, నాన్స్ ఫ్రీ.. ఇది వివక్షకాదా’ అని బెంగళూరుకు చెంది న డాక్టర్ లక్ష్మీ అయ్యర్ నిప్పులు చెరుగుతున్నారు.

అర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ మన దక్షిణాదివారే. ఆమె సెప్టెంబర్ ౩న జీఎస్టీ స్లాబులపై ‘దివాళి కానుక’ ప్రకటించారు. ఇంత అన్యాయం చేశారేంటీ అని మధురైలోని మురుగన్ ఇడ్లీ దుకాణం యజమాని మురుగన్ ప్రశ్నిస్తున్నారు. ‘దోశ అంటే ఏమను కుంటున్నారు? అది కడుపులో వేసుకొనే అల్పాహారం మాత్రమే కాదు.. పులియబెట్టిన పిండితో దోశను తయారుచేయడం ఓ ఆర్ట్.. అంత ఆర్ట్ పీస్‌పై టాక్స్ వేయడం ఏమిటి’ అని ఆయన మండిపడుతున్నారు. 

ఇడ్లీని డీప్ ఫ్రై చేయండి!

ముంబైలో జిబజిబలాడే మార్కెట్లలో సమోసాలు అమ్మె అలీ బాయ్.. సమోసాల మీద జీరో జీఎస్టీ అనగానే ఎగిరి గంతేసాడు. నా సమోసాలపై పడి ఎడవకండి అని ఆయన దక్షిణాదివారికి.. శాంతమూలేక సౌక్యమూలేదు అని బోధిస్తున్నాడు ‘దక్షిణాదివారు ఓ పనిచేస్తే పోలేదా? మీ ఇడ్లీ మీద టాక్స్ తీసేయాలా? అయితే ఓ పనిచేయండి ఇడ్లీని డీప్ ఫ్రై చేస్తే సరిపోతుందిగా.. అప్పుడు టాక్స్ ఉండదు’ అని ఉచిత సలహా కూడా ఇస్తున్నాడు.

ఇలాంటి మాటలే దక్షిణాది అల్పాహార ప్రియులను జెన్‌హా ఉద్యమాలవైపు తప్పక నడిపించితీరాలని టాక్స్‌ను అనుభవిస్తున్న ఇడ్లీ, దోశలు ఆశిస్తున్నాయి! హైదరాబాద్‌లో ‘ఇడ్లీ ఫర్ ఈక్వాలిటీ’ అంటూ ఫ్లాష్‌మాబ్ ఒక ఆందోళన తలపెట్టిందటగా అంటే, పంజాగుట్టలో హడావిడిగా వెళ్తున్న హరీశ్  ‘ఔనా’ అన్నాడు. కర్ణాటకలో రాగి ముద్దపై ౫% టాక్స్ వేయడంపై అక్కడివారు జీర్ణించుకోలేకపోతున్నారు.

‘మాకు సాఫ్ట్‌వేర్ రంగం ఉందనేగా అంతకోపం.. రాగి ముద్దపై మేము రాద్దాంతం లేయలేమా’ అనేది విజి నాయర్ ఆగ్రహం. ఇంతగా వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలను, భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ కౌన్సిల్ యూ టర్న్ తీసుకొంటుందా? లేదా ఎక్స్‌ట్రా చట్నీ అడగకుండా ప్లేట్ ఇడ్లీతోనే చేయి కడుక్కొవాల్సి వస్తుందా.. మమ అనుకోవాల్సి వస్తుందా? అనేది చూడాలి.

* ‘ఒక్క దేశం, ఒక్క పన్ను’ అంటూ జీఎస్టీ తెచ్చారు. మరి అలాలేదు.. ‘ఒక దేశం, రెండు నాస్తాలు’గా ఉంది. ఒకదానికి సబ్సిడీ లభిస్తుంది, మరొక దానిపై సర్‌చార్జీ ఉంటుంది.

 పోషకాహార నిపుణురాలు ప్రియామీనన్

* చపాతీలు మన దేశానికి వెన్నెముక వంటివి. చపాతీలపై ఇప్పుడు జీఎస్టీ తొలగించడం వల్ల  మన వెన్నముకలు ఇంకా గట్టిపడతాయి.

 కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్‌సింగ్

* ఇడ్లీలపై ౫% జీఎస్టీ వేశారు. ఇక ఇడ్లీలను ‘మోడిడ్లీస్’ అని పిలుద్దాం. పన్నును ఢిల్లీకి పంపిద్దాం.

 తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్