calender_icon.png 27 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల

27-09-2025 12:46:15 AM

నకిరేకల్, సెప్టెంబర్ 26: నకిరేకల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 వైన్స్ షాపులకు నోటిఫికేషన్ చేయడం జరిగిందని నకిరేకల్ ఎక్సైజ్ సీఐ మల్లయ్య తెలిపారు.  నకిరేకల్ టౌన్ - 9, కట్టంగూర్ మండలం-3 శాలిగౌరారం మండలం -3 కేతేపల్లి మండలం -3  మండలాల వారిగా దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం కోసం నోటిఫికేషన్ విడుదల  చేయడం జరిగిందని  ఆయన తెలిపారు.

నకిరేకల్ లో గౌడ్స్ సామజిక వర్గానికి 4,ఎస్సీ సామజిక వర్గానికి -2 షాపులు కేటాయించారని  ఆయన పేర్కొన్నారు. మద్యం దుకాణాలకు 26 సెప్టెంబర్ 2025 నుంచి ఆక్టోబరు18వరకుదరఖాస్తులనుస్వీకరించనున్నారని, దరఖాస్తు ఫారంతో పాటు రూ. 3 లక్షల డీడీ, లేదా రూ. 3 లక్షలను  చలాన్ రూపంలో చెల్లించిన రసీదు జత పరుచాల్సించి ఉంటుందని ఆయన తెలిపారు. 

దరఖాస్తులు అందజేసిన వారికి వెంటనే దరఖాస్తు రసీదు తో పాటు ఆక్టోబరు 23 న డ్రాలో పాల్గొనడానికి అవసరమైన ఎంట్రీ పాసు ఇస్తారని దరఖాస్తుదారుడు స్వయంగా కానీ ఆథరైజ్డ్ పర్సన్ ద్వారా కానీ డ్రా యందు పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.