calender_icon.png 12 January, 2026 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిలో 91 దరఖాస్తులు

06-01-2026 01:26:02 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, జనవరి 5 (విజయ క్రాంతి): కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జిదారుల నుండి వినతి పత్రాలనుస్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో 91 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించిన ఆయా దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఇస్తూ అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, డి డబ్ల్యు ఓ, డబుల్ బెడ్ రూమ్, వ్యవసాయం, పంచాయితీ, తదితర దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మార్కవుట్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  భూ భారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు  వెంటనే  పరిష్కరించాలని ఆన్నారు. అనంతరం  90 వ జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (ౄIPC) సమావేశం సోమవారం  జిల్లా కలెక్టరేట్లో జిల్లా డి ఐపిసి చైర్మన్ , జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన, డిఐపిసి కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించబడింది.  ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఇండస్ట్రీ ఆఫీసర్ లాలూ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, డి ఐ పి సి కమిటీ సభ్యులు , తదితరు లు పాల్గొన్నారు.