calender_icon.png 12 January, 2026 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ ఇవ్వాలి

06-01-2026 01:27:41 AM

  1. సీఎంకు పీఆర్‌టీయూ నేతల వినతి
  2. సంఘ డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): పీఆర్టీయూటీఎస్-2026 డైరీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం శాసనసభలోని ఆవరణలో పీఆర్టీయూటీఎస్ 2026 నూతన సంవత్సర డైరీని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుం కరి భిక్షం గౌడ్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలను సీఎం దృష్టికి వారు తీసుకెళ్లారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెం.57 ద్వారా, హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కోరారు. సీఎంను కలిసినవారిలో మాజీ ఎమ్మెల్సీ బీ.మోహన్ రెడ్డి, సంఘం నాయకులు వంగ మహేందర్ రెడ్డి, పీ.వెంకట్ రెడ్డి, జగన్‌మోహన్, ఎస్.శ్రీనివాస రెడ్డి ఉన్నారు.