09-10-2025 12:30:54 AM
అబ్దుల్లాపూర్ మెట్, అక్టోబర్ 08: రైతులకు కావాల్సిన వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.. రాయితీ కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఐ పల్లవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర రైతులకు 50శాతం రాయితీపై బ్యాటరీ పంపులు, పవర్ పంపులు, రోటోవెటర్లు, వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలో ఉన్న రైతులు పట్టాదార్ పాసుబుక్కులు, ఆధార్ కార్డు, పాస్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ట్రాక్టర్‌తో నడిచే పనిముట్లకు ట్రాక్టర్ ఆర్సీలను జతపరిచి సంబంధిత వ్యవసాయ కార్యాలయంలో అందజేయగలరు. పూర్తి వివరాల కోసం అబ్దుల్లాపూర్ మెట్‌లోని రైతు వేదికను ఆశ్రయించి వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించగలరు. పూర్తి వివరాల కోసం మండల వ్యవసాయాధికారి సెల్ : 8977753709, వ్యవసాయ విస్తరణ అధికారి: 6305920181.