calender_icon.png 9 October, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనావాసాల మధ్య పటాకుల దుకాణాలు వద్దు: మున్సిపల్ కమిషనర్

09-10-2025 12:32:37 AM

  తాండూరు 8 అక్టోబర్ (విజయక్రాంతి) : రాబోయే దీపావళి పండుగ సందర్భంగా బాణా సంచా దుకాణాలను నిబంధన మేరకు అనుమతి పొంది ఏర్పాటు చేసుకోవాలని  వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి సూచించారు. బుధవారం  బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసే యజమానులతో సమావేశం నిర్వహించారు.నివాస ప్రాంతాల్లో బాణా సంచ దుకాణాలను ఏర్పాటు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. జనవాసాల మధ్య ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.లైసెన్సును పొందడానికి  అగ్నిమాపక శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉమేష్ కుమార్, వెంకటయ్య, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.