18-05-2025 10:46:35 PM
జిల్లా మైనారిటీ అధ్యక్షులు యాకూబ్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఈ యేడాది 2025లో జరగనున్న నీట్, జేఈఈ కౌన్సెలింగ్ కు హాజరు కానున్న మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు 'మైనారిటీ స్టేటస్' సర్టిఫికేట్ కొరకు స్తానిక ఈ-సేవ సెంటర్ లలో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ ద్వారా యంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో మరియు జేఈఈ మేయిన్ ద్వారా ఐఐటీలో, యన్ఐటీ లలో, ఈఎపిసెట్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ లలోప్రవేశాల కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ లో మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుందన్నారు.
గతంలో ఈ సర్టిఫికేట్లను, విద్యార్దులు తాము చదివిన పాఠశాలల నుండి పొందేవారని, రాష్ట్ర రెవిన్యూ శాఖ వారు గతంలో విడుదల చేసిన జీఓ ప్రకారం విద్యార్దులు తహశీల్దార్ కార్యాలయం నుండే మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ పొందాలని, ఇందుకు గాను రెవిన్యూ శాఖ విడుదల చేసిన దరఖాస్తు ఫారంతో పాటు ఓ.సి, బిసి-సి, బిసి-ఈ, బిసి- బి కుల సర్టిఫికేట్ , 10వ తరగతి టి.సి, అధార్ కార్డు లేదా రేషన్ కార్డు, నీట్, జేఈఈ, ఈఎపిసెట్ -2025, ర్యాంక్ కార్డుతో ఈ-సేవ సెంటర్లో సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. కావున మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లింలు, క్రిస్టియన్ లు, సిక్కులు, జైనులు, బౌద్దులు, జోరాస్ట్రీయన్ లు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. సూచించారు. ఇతర సమాచారం కోసం మరియు మైనారిటీ స్టేటస్ దరఖాస్తు ఫారం కొరకు 8520860785, నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.