12-01-2026 01:41:08 AM
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): భారతదేశానికి బుర్కా వేసుకున్న మహిళను ప్రధాని చేయాలని కలగనే ముం దు.. ఎంఐఎం పార్టీకి ఒక మహిళను అధ్యక్షురాలిగా చేయాలని కేంద్రమంత్రి బండి సంజ య్ పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఆదివారం ప్రశ్నించారు. పార్టీలో నిజంగా నిర్ణయాలు తీసుకునే పదవుల్లో ఎంత మంది మహిళలు ఉన్నారు? అని నిలదీశారు. ‘మీ నినాదాలు జీరో మహి ళా ప్రాతి నిథ్యాన్ని దాచలేవు’అని విమర్శించారు. 2018లో బీజేపీ షహజాదీ సయీద్ ను పాతబస్తీలో పోటీకి దించితే ఆమెకు బెదిరింపులు వచ్చాయని, ఈరోజు ఆమె జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలన్నారు.
బీజేపీకి మైనారిటీ మోర్చా ఉందని, మహిళా నాయకులను తయారు చేస్తోందని, ఎంఐఎం మాటలకే పరిమితమని విమర్శించారు. ఎంఐఎం ఇప్పటి వరకు ఎంత మంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యేలు లేదా ఎంపీల టికెట్లు ఇచ్చిందన్నారు. నిజమైన మహిళా సాధికారత మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల వల్లే వ చ్చిందన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, ముస్లిం మహిళలకు చట్టపరమైన రక్షణ, మహిళల పేర్ల మీదే పథకాలు, మహిళల పేర్లపై బ్యాంక్ ఖాతాలు, గ్యాస్, ఇళ్లు ఇస్తున్నారన్నారు.