calender_icon.png 12 January, 2026 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్దేశపూర్వకంగానే దాడులు!

12-01-2026 01:43:42 AM

  1. కాంగ్రెస్ పాలనలో ఆందోళనకరంగా హిందువుల పరిస్థితి
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి రోజు రోజుకీ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. కాం గ్రెస్ పార్టీ ప్రవర్తనలో ముస్లిం లీగ్- మావోయిస్టు సానుకూల పార్టీగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ సఫిల్‌గూడ కట్టమైసమ్మ దేవాలయాన్ని రాంచందర్‌రావు ఆదివారం సందర్శించి మాట్లాడారు. మల్కాజ్‌గిరి ఘటన హిందూ విశ్వాసంపై దాడి అని, గత రాత్రి జరిగిన సంఘటన ఈ ప్రభుత్వ వైఖరికి స్పష్టమైన నిదర్శనమన్నారు.

హిందువుల భద్రత, హిందూ విశ్వాసాల పరిరక్షణ విషయంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రత్యేక వర్గాన్ని ఓటు బ్యాంకుగా చూసి చేసే రాజీ రాజకీయాలకు -ఇవి స్పష్టమైన ఉదాహరణలన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని, బీఆర్‌ఎస్ నా యకులు సైతం మాట్లాడలేదని విమర్శించారు. హిందూ విశ్వాసంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోబోమని, ఆలయాల రక్షణ కోసం, హిందువుల గౌరవ పరిరక్షణ కోసం, గోమాత రక్షణ కోసం పోరాడతామన్నారు. 

రాంచందర్‌రావుకు అవార్డు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు -2026 వరించింది. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తార్నాకలోని ఆయన నివాసంలో స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకొని ఏర్పా టు చేసిన కార్యక్రమంలో రాంచందర్‌రావు మాట్లాడారు. యువత వివేకనందుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మేధావుల ఫో రం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్, కార్యదర్శి ప్రొ.మహ్మద్ ఆక్తేర్‌అలీ, ఉస్మానియావర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రొ.డాక్టర్ రవితేజచౌహాన్ తదితరులు రాంచందర్‌రావును జ్ఞాపికతో సన్మానించి, అవార్డును ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, జీ వేణుగోపాల్ పాల్గొన్నారు.