12-01-2026 01:34:26 AM
థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ సినిమా
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందని ఆదివారం ఎక్స్ వేదికగా స్పం దించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుందని, మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి ఏమో నాకు తెలియదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నడుపుతున్నది సర్కా రా.. లేక సర్కస్ కంపెనీనా? టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసి నా.. ఈ ప్రభుత్వ తీరు మారడం లేదన్నారు. సీఎం అసెంబ్లీ వేదికగా టికెట్‌రేట్ల పెంపు ఉండదని చెప్పి రాత్రికి రాత్రే పెంపు జీవోలు ఎట్లా వచ్చాయన్నారు.