calender_icon.png 23 August, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా గోమాస శ్రీకాంత్ నియామకం

21-09-2024 02:30:19 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా బెల్లంపల్లి మండలంలోని మాల గురుజాల గ్రామానికి చెందిన గోమాస శ్రీకాంత్ నియామకమయ్యారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిడి గోపాల్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పారు.