calender_icon.png 21 October, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా అరవ లక్ష్మి

20-10-2025 12:00:00 AM

ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

జగిత్యాల అర్బన్, అక్టోబర్ 19 (విజయ క్రాంతి) : జగిత్యాల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మిని జాతీయ బిసి సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలిగా నియమించినట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య తెలిపారు.ఆదివారం హైదరాబాద్ లోని కార్యాలయం లో కృష్ణయ్య లక్ష్మీకి నియామకపు ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూసంఘం కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించడంతో పాటు, భాజపా మున్సిపల్ కౌన్సిలర్ గా  బిజెపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా, బిజెపి మహిళ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షురాలిగా ఆరవ లక్ష్మీ అందించిన సేవలను గుర్తించి ఈ హోదా కల్పించినట్లు కృష్ణయ్య చెప్పారు.

మహిళల సమస్యల పరిష్కారానికి, బిసి సంక్షేమ సంఘం బలోపేతానికి శాయశక్తులా కృషి చెయ్యాలని కృష్ణయ్య పేర్కొన్నారు.ఆరవ లక్ష్మీ నియామకం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ దాసరి రజనీ, తదితరులు శుభాకాంక్షలుతెలిపారు.