20-10-2025 12:00:00 AM
మానకొండూర్, అక్టోబర్ 19: (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా మనకొండూరు మండలం గట్టు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన గట్టు రమేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ భౌతికశాస్త్ర విభాగం నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా పొందారు. గట్టు ఎల్లయ్య గౌడ్, శ్రీమతి లక్ష్మి దంపతుల కుమారుడైన రమేష్ పరిశోధనను సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి రేడియోథెరపీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె. కృష్ణమూర్తి పర్యవేక్షణలో పూర్తి చేశారు.
ఆధునిక కాన్ఫార్మల్ రేడియోథెరపీ చికిత్సలలో డోస్ డెలివరీలో చోటుచేసుకునే తప్పిదాల విశ్లేషణ అనే శీర్షికతో రూ పుదిద్దుకున్న ఈ థీసిస్లో రేడియోథెరపీ చికిత్స సమయంలో మోతాదు పంపిణీలో జరిగే లో పాలు, వాటి ప్రభావం, నివారణ చర్యలు మరియు నాణ్యత నియంత్రణ పైన దృష్టి సారించారు. మెడికల్ ఫిజిక్స్ రంగానికి ఈ పరిశోధన ఉపయోగకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు.సాధారణ కుటుంబానికి చెందిన రమేష్ పట్టుదలతో ఉన్నత విద్యను అందిపుచ్చుకోవడం గ్రామానికి, జిల్లాకు గర్వకారణమని స్థానికులు పేర్కొన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగం మరియు కిమ్స్ రేడియోథెరపీ బృందం ఆయనకు అభినందనలు తెలిపారు. డాక్టర్ రమేష్ పరిశోధన ఫలితాలు మెడికల్ ఫిజిసిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, డోసిమెట్ట్రిస్టులు మరియు కేన్సర్ రేడియోథెరపీ నిపుణులకు మార్గదర్శకంగా నిలుస్తాయని వెల్లడించారు.భవిష్యత్తులో మెడికల్ ఫిజిక్స్, రేడియోథెరపీ క్వాలిటీ అష్యూరెన్స్ రంగాలలో మరిన్ని శోధనలతో విజయాలు సాధించాలని శుభాకాంక్షలుతెలిపినారు.