calender_icon.png 12 January, 2026 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు పదవులు హుళక్కేనా!

11-01-2026 12:00:00 AM

డాక్టర్ తిరునహరి శేషు :

గత కొంతకాలంగా తెలంగాణలో రాజకీయాలు బలహీన వర్గాల చుట్టూనే తిరుగుతున్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో కావొచ్చు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావొచ్చు మునుపెన్నడూ లేని విధంగా బీసీలను విస్మరించి రాజకీయాలు చేయలే ని స్థితిలోకి పార్టీలు ఉండిపోతున్నాయి. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సం దర్భంగా బీసీల ఓట్ల కోసం నాటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ ‘బీసీ బంధు’ ప్రకటిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించింది.

మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఏకంగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామనే హామీని ఇచ్చింది. శాసనసభ ఎన్నికల్లో గెలి చి తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు లాంటి అంశాలు రాష్ర్టంలో బీసీల్లో రాజకీయ చైతన్యాన్ని నింపాయని చెప్పొచ్చు.

గత ఆరు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ వర్గాలైన బీసీలకు పార్టీ లు, ప్రభుత్వాలు అధికారంలో ఆర్థికంగా అన్యాయం చేశాయనే భావనతోనే బీసీలు ఉద్యమ బాట పట్టినట్లుగా అనిపిస్తున్నది. దశాబ్దాలుగా పార్టీలు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే భావించాయి. కానీ వారి అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టలేదనే భావన బీసీల్లో గూడుకట్టుకొని ఉన్నది.

కులగణనతో ఉపయోగం!

దేశంలో జనగణనలో భాగంగా కులగణన జరగాలనే రాహుల్‌గాంధీ ఆలోచనల కు అనుగుణంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కులగణ న చేపట్టాయి. రాహుల్‌గాంధీతో పాటు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో తెలంగాణలో జరిగిన కులగణన దేశానికి ఒక రోల్ మోడల్ అని చెబుతున్నారు కానీ తెలంగాణ రాష్ర్టంలో జరిగిన కులగణనపై బలహీన వర్గాలు తమ అసంతృప్తిని, అభ్యంతరాలను వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

కులగణన  రిపోర్టులో బీసీల జనాభాను, వారి జనాభా శాతాన్ని తక్కువ చేసి చూపించార నే ప్రధాన విమర్శ బీసీల నుంచి వ్యక్తమయ్యింది. కులగణనను స్వాగతించిన బీసీ లు కులగణన రిపోర్టులో బీసీల జనాభాను 46.25 శాతంగా చూపించడాన్ని స్వాగతించలేకపోయారు. రాష్ర్టం ఏర్పాటైన తరువా త ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుం బ సర్వేలో బీసీలు 51 శాతముంటే కులగణనలో 46 శాతం ఎలా ఉంటారనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

10 శాతం మైనార్టీ బీసీలతో కలిపి రాష్ర్టంలో బీసీలను 56 శాతానికి పరిమితం చేసింది. తెలంగాణ కంటే ముందు కులగణన నిర్వహించిన బీహార్, కర్ణాటక రాష్ట్రాలు నిర్వ హించిన కులగణనలో.. ఏ కులం ఎంత శాతం? వారి వెనుకబాటుతనానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెల్లడి చేయ గా.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన రాష్ర్టంలో ఏ కులం ఎంత?  వారి వెనుకబాటుతనం ఎంత అనే  సమాచారం వెల్లడించకుండానే మన కులగణన దేశానికి రోల్‌మాడల్  అని ఎలా చెప్పగల దు.

కులగణనలో ఉన్న పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు. 42 శాతం రిజర్వేషన్ల సాధనకు నియమించిన డెడికేటెడ్ కమిషన్ కూడా 134 బీసీ కులాల్లో ఏ కులం ఎంత వెనుకబాటుతనాన్ని కలిగి ఉన్నది అనే విషయాన్ని స్పష్టం చేయకపోవడం కూడా కోటా సాధనకు అడ్డంకిగా మారిందన్న విషయం గమనించాలి.

పంచాయతీల్లోనూ అన్యాయం!

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడానికి బీసీలు, బీసీ సంఘాలు, కుల సంఘా లు ప్రభుత్వంపై గట్టిగానే ఒత్తిడి చేశాయి. కానీ రిజర్వేషన్ల కల్పన కోసం ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యా యి. చట్టబద్ధంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీతో గ్రామపంచాయతీ ఎన్నికలకు వెళ్లినా ప్రభు త్వం తన హామీని నిలబెట్టుకోలేకపోయింది.

2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బీసీలకు 23 శాతం రిజర్వేషన్‌లు కేటాయిస్తే ఈ పర్యాయం మొత్తం 12,728 గ్రామపంచాయతీలో బీసీలకు 2,176 గ్రామపంచాయతీలను అంటే కేవలం 17 శాతం పంచాయతీలనే కేటాయించారు. ఎన్నికలు జరిగిన మొత్తం 12,702 గ్రామపంచాయతీల్లో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే బీసీలు 5,335 గ్రామపంచాయతీలు గెలవాలి.

కానీ రాష్ర్ట ఎన్నికల కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా బీసీలు గెలుపొందిన గ్రామ పంచాయతీలు 4,946 మాత్రమే అంటే 38.9 శాతం పం చాయతీలను మాత్రమే బీసీలు గెలవగలిగారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పార్టీలు, ప్రభుత్వం వైఫల్యం చెందాయి. కాబట్టి రాబోయే పురపాలక, ప్రాదేశిక ఎన్నికల్లోనైనా బీసీల రిజర్వేషన్ల పట్ల పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి. 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభు త్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో బీసీలకు 49 మున్సిపాలిటీలను కేటాయించాలి. 

బీసీలకు 42 శాతం అంటే 5,773 ఎంపీటీసీల్లో 2,424 స్థానాలు, 566 జెడ్పీటీసీల్లో 237 స్థానాలు, 31 జిల్లా పరిషత్ చైర్మన్‌లలో 13 చైర్మన్ పదవులు, 237 మండల ప్రజా పరిషత్ చైర్మన్‌లను బీసీలకు రిజర్వ్ చేయాలి. పార్టీరహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకి 42 శాతం పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకున్న పార్టీలు రాబోయే ప్రాదేశిక, పురపాల క ఎన్నికలలో ఆ మేరకు సీట్లను కేటాయిస్తే ఆయా పార్టీల వైఖరి స్పష్టమవుతుంది.

బడ్జెట్ హామీలు నెరవేరేనా?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రెండు పూర్తిస్థాయి బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది. కానీ రెండు బడ్జెట్లలోనూ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రతి బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి 20వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం, అలాగే బీసీ సబ్ ప్లాన్ కూడా అమలు చేస్తామన్న ప్రధాన హామీ లు నెరవేరలేదు. 2024-25 బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి 9,300 కోట్ల రూపాయలు, 2025-26 బడ్జెట్లో 11, 405 కోట్ల రూపాయలను కేటాయించారు.

అంటే మొత్తం బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి 3.2 శాతం నిధులను మాత్రమే కేటాయించారు. అయితే మన పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదే శ్ బడ్జెట్.. తెలంగాణతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ తన బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి 47 వేల కోట్ల రూపాయలను కేటా యించడం విశేషం.  బడ్జెట్‌లో బీసీ కార్పొరేషన్‌కు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయిం చే నిధులను కూడా తగ్గిస్తూ ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.

బీసీల ఐక్యత అవసరం..

రిజర్వేషన్లు లాంటి క్లిష్టమైన అంశాలను అమలు చేయడానికి చట్టాలు, కోర్టులు, నిబంధనలు అడ్డు వచ్చాయనుకుంటే మరి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన బడ్జెట్ పరమైన హామీలను అమలు చేయటానికి ఏ చట్టాలు అడ్డువస్తున్నాయని బలహీనవర్గా లు ప్రశ్నిస్తున్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో అమలు చేయకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

కులగణన, 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెడుతూ అన్యాయం చేస్తున్నారనే భావన కలుగుతుంది. ఉమ్మడి ఏపీ, దశాబ్దపు బీఆర్‌ఎస్ పాలనలో, కాంగ్రెస్ పాలనలోనూ బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి పట్ల, ఆయా ప్రభుత్వాల దృక్పథాల్లో మార్పులు ఏమీ కనబడటం లేదన్న అసంతృప్తి బీసీ వర్గాల్లో ఉంది. బీసీల సంక్షేమం అభివృద్ధి విషయంలో పార్టీలు, ప్రభుత్వాల హామీలు కోటలు దాటుతున్నాయి.

కానీ చేతల్లో మాత్రం గడప కూడా దాటడం లేదన్నది వాస్తవం. ఉత్తర భారతంలో జాట్‌లు రాజకీయంగా బలమైన శక్తిగా ఆవిర్భవించినట్లు గానే తెలుగు రాష్ట్రాల్లో బలహీనవర్గాలన్నీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఏర్పడకపోతే తమ దశాబ్దాల వెనుకబాటుతనం నుండి బలహీనవర్గాలు బయటపడలేరన్నది వాస్తవం.

 వ్యాసకర్త సెల్: 9885465877