07-08-2025 01:35:39 AM
మహిళపై దాడి
కూకట్‌పల్లి ఆగస్ట్ 6 (విజయక్రాంతి): డబ్బులు విషయంలో తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారడంతో ఓ వ్యక్తి మహిళపై దాడి చేయడంతో ఆమె తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందు తుం ది... ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వి వరాలు ప్రకారం కెపిహెచ్బి కాలనీ 7 వ ఫేజ్ లో మణి మాల (53) అనే మహిళ కిరాణా దుకాణం నడుపుతుంది.. అదే కాలనీ లో రాజేష్ రెడ్డి (48) అనే వ్యక్తి నివసిస్తు వంట మాస్టర్ గా పనిచేస్తుంటాడు.. తరచూ మణి మాల షాప్ కు వెళ్టూ ఉండటంతో వారు రాజేష్‌రెడ్డికి అప్పుగా కిరాణా సరుకులు ఇస్తుంటారు.. ఈ క్రమంలో బుధవారం రాజేష్‌రెడ్డి షాప్‌కు రాగా తమకు ఇవ్వాల్సిన 7000 ఇవ్వాలని గట్టిగా నీలాదీసింది.
అప్పు డు అక్కడినుండి వెళ్లిపోయిన రాజేష్ రెడ్డి కొద్దిసేపటి తర్వాత వారి ఇంటికి వెళ్లి ఆమెతో ఘర్షణ కు దిగి ఆమెపై కత్తితో దాడి చేసాడు.. ఈ దాడిలో మాణిమాల గొంతుకు బలమైన గాయలయ్యాయి.. ఇద్దరి మధ్య పెనుగులాటలో రాజేష్ రెడ్డి చేతికి సైతం గాయాలు కాగా ఇద్దరు హాస్పిటల్ లో చికి త్స పొందుతున్నారు...అయితే మణి మాల కు తాను వేరే వ్యక్తి వద్ద నుంచి 50,000 డబ్బు లు ఇప్పించానని అవి ఇవ్వకుండా ఇబ్బందిపేట్టాడం తోనే దాడి చేసిన ట్లుగా పోలీసు లుకు చెప్పినట్టు తెలిసింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.