07-08-2025 01:35:12 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6: గోవా రాష్ర్టంలోని గోవా యూనివర్సిటీ వద్ద ఉన్న డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో పదో జాతీయ ఓబీసీ మహా సభను గురువారం పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహ సభకు ముఖ్య అతిథులుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ర్ట పీసీసీ అధ్యక్షుడు నానాపటేల్, మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతోపాటు దేశంలోని అఖిలపక్ష పార్టీల నాయకులు, సామాజిక ఉద్యమకారులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.
ఈ మహసభకు తెలంగాణ నుండి వెయ్యి మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారాని వివరించారు. ఈ మహసభలో బీసీ డిమాండ్లపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, జాతీయ ఓబీసీ మహాసభకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది హజరై విజయవంతం చేయాలని కోరారు.