calender_icon.png 13 August, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల సందడి

10-08-2025 05:09:21 PM

జనగామ,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ 14వ వార్డు టిఎన్జిఓ కాలనీలోని పోచమ్మ తల్లి దేవాలయంలో ఆగస్టు 10న పండుగ వాతావరణం నెలకొంది. రాజు నరసయ్య దంపతులు, విజయ్ పాల్ రెడ్డి దంపతులు, దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్ దంపతులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి  బాటలో నడుస్తూ మరియు ఎమ్మెల్యే  స్ఫూర్తి తో ఇలాంటి సేవలు మరి ఎన్నో ముందు ఉన్న రోజులలో చేస్తాను అన్నారు.

ఈ ప్రత్యేక రోజు సందర్భంగా జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ తరఫున దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్  రూ.10,116 చెక్కును ఆలయానికి విరాళంగా అందించారు. 14వ వార్డు ప్రజలందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగినది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, అమ్మవారి దర్శనం తీసుకొని, ఆశీర్వాదాలు పొందారు. ఆనందం, భక్తి, సంబరాలతో ఆలయం కిక్కిరిసింది జనగామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.