07-08-2025 01:37:05 AM
-హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): విద్యార్థులు ఇష్టపడి కష్టపడి అంకితభావంతో చదివితేనే ఉన్నత లక్ష్యాలను సాధిం చుకోగలుగుతామని హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు బుధవారం ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిక్కడపల్లి లోని కొమరం భీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
సందర్భంగా బండారు దత్తాత్రేయ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులతో వారి చదువు విధానం, పోటీ పరీక్షలకు సిద్ధమవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటి పలు అంశా లపై సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలంటే ఒక లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ నిర్వాహకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.