calender_icon.png 13 August, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న పంటలు... అడవి పందుల బీభత్సం

10-08-2025 05:03:04 PM

ధ్వంసమైన మొక్కజొన్న పంట

రెండు ఎకరాల పంట నష్టపోయిన రైతు

నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్న రైతులు

కామారెడ్డి,(విజయక్రాంతి): రైతు పండించే పంట ఆరు కాలం కష్టపడి సాగు చేస్తే చేతికి వచ్చేవరకు గ్యారెంటీ లేని పరిస్థితుల్లో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ప్రకృతి మరోవైపు మరోవైపు అటవీజంతువులు రైతుల పంటలను నష్టం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం  బసవన్నపల్లి గ్రామంలో ఏనుగు రాజిరెడ్డి తనకు ఉన్న రెండేకరాల మెట్ట భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. మొక్కజొన్న పంట కంకులు అవుతున్న సమయంలో ఎలుగుబంటులు వచ్చి మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి.

మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు ఒకవైపు రైతు ప్రయత్నిస్తుండగా మరోవైపు ఎలుగుబంటులు వచ్చి పంటను నాశనం చేశాయి. దీంతో రైతు ఏనుగు రాజు రెడ్డి తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి పెట్టి మొక్కజొన్న పంట రెండెకరాల్లో సాగు చేస్తే మొక్కజొన్న కంకులుగా ఏర్పడే సమయంలో ఎలుగుబంట్లు వచ్చి పంటను ధ్వంసం చేసి వెళ్ళాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తనకు పంట నష్టపరిహారం ఇప్పించాలని వాపోతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.