10-08-2025 04:56:19 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గోదాసి అజయ్ కుమార్, ఎస్ఎస్ వర్మ, ప్రవీణ్ యాదవ్, నవీన్ యాదవ్, సతీష్ తదితరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వీరికి తీర్థ ప్రసాదాలు అందించి, వారి శ్రేయస్సు కోసం ఆశీర్వచనాలు అందజేశారు. దర్శనానికి వచ్చిన నాయకులు ఆలయ పరిసరాలను పరిశీలించి, భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన ఏర్పాట్లపై మాట్లాడారు.