calender_icon.png 13 August, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సమష్టి కృషి

10-08-2025 04:59:11 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కృషి. అంజన్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు చురుకుగా కృషి చేస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధి లక్ష్యాలను విస్తృతంగా చేరవేయడానికి శ్రీనివాస్, కృష్ణ, కృష్ణకుమార్, మోషిన్, ఉర్వశి, గోదాసి కుమార్, ఆకాష్, గణేష్ యాదవ్, సతీష్ తదితరులు బృందంగా శ్రమిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు విని, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తూ, ఓటర్లలో నమ్మకం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు సాధించాలని, జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పథాన్ని కొనసాగించాలని ఈ బృందం సంకల్పం వ్యక్తం చేస్తోంది.