calender_icon.png 12 September, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిసారి బరిలో అర్జున్

04-12-2024 12:00:00 AM

నార్వే చెస్ చాంపియన్‌షిప్

స్టావెంజర్ (నార్వే): తెలంగాణ చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి నార్వె చెస్ 2025 టోర్నీలో బరిలోకి దిగనున్నాడు. ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ చాంపియన్‌షిప్‌లో అర్జున్ పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది. మే 26 నుంచి జూన్ 6 వరకు నార్వేలోని స్టావెంజర్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.

ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న అర్జున్.. సెప్టెంబర్‌లో భారత్ చెస్ ఒలింపియాడ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో టీమ్ గోల్డ్‌తో పాటు వ్యక్తిగత స్వర్ణం గెలుచుకున్నాడు. నవంబర్‌లో ప్రతిష్ఠాత్మక ఫిడే లైవ్ రేటింగ్స్‌లో తొలిసారి 2800కి పైగా ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించి రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గా అర్జున్ రికార్డులకెక్కాడు. వచ్చే ఏడాది మేలో జరగనున్న నార్వే చెస్ టోర్నీలో డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో పోరు జరగనుంది.