దళితోద్యమ తొలిపొద్దు భాగ్యరెడ్డి వర్మ
ఓయూలో ఘనంగా భాగ్యరెడ్డివర్మ జన్మదిన వేడుకలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22(విజయక్రాంతి): దళితోద్యమ తొలిపొద్దు భాగ్యరెడ్డి వర్మ అని ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ (అమ్సా) అధ్యక్షుడు నామ సైదులు పేర్కొన్నారు. బుధవారం ఉస్మానియా యూ నివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట భాగ్యరెడ్డివర్మ జయంతి వేడుకలను అమ్సా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ భాగ్యనగరం నడిబొడ్డున జన్మించిన భాగ్యరెడ్డివర్మ సామాజిక ఉద్యమాలకు తొలి గురువు అని, ధ్రువతార అని కొనియాడారు. అస్పృశ్యతను రూపుమాపడానికి, అణగారిన వర్గాల చైతన్యం కోసం భాగ్యరెడ్డివర్మ నిరంతరం పోరాడారని తెలిపారు. దళిత బాలికల కోసం 26 పాఠ శాలలను నెలకొల్పారని, పలు సంఘాలను ఏర్పాటు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఎన్‌ఎం.శ్రీకాంత్‌యాదవ్, ఉదయ్, గోపి, బసవరాజు, శ్రీను, దామోదర్ పాల్గొన్నారు.






