05-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూలై 4(విజయక్రాంతి): బీసీ సామాజిక ఉద్యమ నాయకుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్దంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేల రాలిన తొలి అమరుడని తెలిపారు.
నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చేందుకు ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసేందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని, ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఇతర శాఖల అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.