24-05-2025 12:30:01 AM
అశ్వాపురం,(విజయక్రాంతి): వైద్య కళాశాలకు తన తండ్రి మృతదేహాన్ని దానం చేసి సమాజం పట్ల బాధ్యతను చాటుకున్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి. అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామపంచాయతీకి చెందిన బలుగూరి మధు సూదన్ రెడ్డి తండ్రి బలుగూరి రామిరెడ్డి (65) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. తన తండ్రి మృతదేహం సమాజానికి ఉపయోగపడాలని సదుద్దేశంతో శుక్రవారం కొత్తగూడెంలోని వైద్య కళాశాలకు విద్యార్థుల పరిశోధనల కోసం ఉపయోగపడాలని ఆలోచనతో ఆయన పార్దివ దేహాన్ని అప్పగించారు . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సిఐటియు రాష్ట్ర నాయకులు పి రాజారావు, సోమన్న, కే రమేష్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె బ్రహ్మచారి, రమేష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.