29-11-2025 12:50:37 AM
డిసెంబర్ 6 నటీమణి సావిత్రి పుట్టిన తేదీ. ఆ మహానటి జన్మిం చి ఈ యేటితో 90 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా సావిత్రి 90వ జయంతి వేడుకలను ‘సావిత్రి మహోత్స వ్’ పేరిట నిర్వహిస్తున్నారు. సంగమం ఫౌండేషన్‌తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాను నిర్వ హిస్తున్నట్టు సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 6 వరకు జరిగే ఈ వేడుకలకు రవీంద్రభారతి వేదిక కానుంది.
ఈ వేడుకలో భాగంగా డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు సావిత్రి సినిమా ల ప్రదర్శన ఉంటుంది. పాటల పోటీలు నిర్వహిస్తారు. చివరి రోజు కార్యక్రమంలో ‘మహానటి’ చిత్ర దర్శక నిర్మాతలు నాగ్‌అశ్విన్, ప్రియాం కాదత్, స్వప్నాదత్ తదితరులను సత్కరించనున్నారు. మండలి బుద్ధప్ర సాద్ అధ్యక్షతన జరిగే ఈ సభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయు డు ముఖ్యఅతిథిగా హాజరవుతారు.