calender_icon.png 29 November, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగువాళ్లకు సినిమానే పండుగ

29-11-2025 12:49:25 AM

2026 సంక్రాంతికి రాబోతున్న సిని మాల్లో ‘అనగనగా ఒక రాజు’ ఒకటి. స్టార్ హీరో నవీన్ పొలిశెట్టి కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2026, జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తొలి పాట ‘భీమవరం బల్మా’ తాజాగా విడుదలైంది.

ఈ గీతావిష్క రణ వేడుక గురువారం సాయంత్రం భీమవరంలో నిర్వహించారు. కథానాయ కుడు నవీన్ పోలిశెట్టి ఎద్దుల బండిపై వేదిక వద్దకు రావడంతో సంక్రాంతి వాతావ రణం అప్పుడే మొదలైనట్టు అనిపించింది. వేదికపై ఆయన మీనాక్షితో కలిసి ‘భీమ వరం బల్మా’ పాటకు స్టెప్పులేసి ఆహూ తులు, అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ఏ కారణాల వల్ల నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో.. ఆ ఎంటర్‌టైన్‌మెంట్, ఆ కామెడీ, ఆ మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ.. అన్నీ ఇందులో ఉంటాయి.

ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పండుగకు సినిమా వస్తుంది అంటారు.. కాదు, తెలుగు ప్రేక్షకులకు సినిమానే ఒక పండుగ. ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం” అన్నారు. కథానాయకి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “మీ అందరి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకం. మన అందరి ఫేవరెట్ ప్రభాస్ సినిమాతోపాటు ‘అనగనగా ఒక రాజు’ వస్తున్నాడు. నవీన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. నవీన్ వన్ మ్యాన్ ఆర్మీ. సినిమా కోసం ఎంతో కష్టపడతాడు. మా ఇద్దరి పాత్రలు మీకు నచ్చుతాయి. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుంది” అని చెప్పింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్, చిత్రబృందం పాల్గొన్నారు.