10-09-2025 12:57:51 AM
ఎల్బీనగర్, సెప్టెంబర్ 9 : ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసి, మోసం చేస్తున్న ఇద్దరు నకిలీ రిపోర్టర్లను మంగళవారం నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... వీ3, విశ్వంబర ఛానల్లలో రిపోర్టర్లుగా పనిచేస్తూ, రెవెన్యూ శాఖ అధికారులమని అనుమతి లేకుండా బోర్లు వేస్తున్న వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
గడ్డి అన్నారం డివిజన్ దిల్ సుఖ్ నగర్ లో నివాసం ఉంటున్న రాచకొండ సతీశ్(32), వీ3 రిపోర్టర్ గా, శ్యామకూరి శివగౌడ్ అలియాస్ శివ(36) విశ్వంబర ఛానల్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. మరో నిందితుడు దామెర నాగ ఫణీంద్ర అలియాస్ ఫణి పరారీలో ఉన్నాడు. రిపోర్టర్లుగా పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమతి లేకుండా బోర్లు వేస్తున్నవారిని రెవెన్యూ అధికారులమని చెప్పి రూ,20 నుంచి 30 వేలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
2025 ఏప్రిల్ 19న ఫతుల్లాగూడ ధనలక్ష్మి కాలనీలో పవన్ అనే వ్యక్తి తన ప్లాట్లో బోరు వేయిస్తుండగా, నింది తులు అతడిని బెదిరించి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి రూ.12 వేలు గూగుల్ పే ద్వారా శివ అకౌంట్కు చెల్లించగా, ఆ మొత్తాన్ని ముగ్గురు పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తరువాత బాధితుడు ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తహసీ ల్దార్ ఆదేశాలతో నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేయగా, మరోకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులమని చెప్పి డబ్బులు డిమాండ్ చేసే మోసగా ళ్లకు ప్రోత్సాహం ఇవ్వకూడదని, వారిపై సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.