calender_icon.png 10 September, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ తీర్పును స్వాగతిస్తున్నాం

10-09-2025 12:58:07 AM

-చర్లపల్లి డ్రగ్స్ కేసులో విచారణ జరిపి సంబంధికులపై చర్యలు తీసుకుంటాం 

-మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాం తి): గ్రూప్ పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని ఎక్సైజ్, పర్యాట క మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కోర్టు తీర్పును పరిశీలించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపా రు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహిం చిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమా నికి హాజరై.. వివిధ సమస్యలపై ప్రజల నుం చి ఆయన దరఖాస్తులు స్వీకరించారు.

ఆ తర్వాత గాంధీభవన్‌లో మీడియాతో మాట్లా డుతూ.. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆ ర్‌ఎస్ గ్రూప్- పరీక్షను సజావుగా నిర్వ హించలేదని ఆరోపించారను. చర్లపల్లి డ్రగ్స్ కేసులో విచారణ జరిపి నివేదిక సమర్పిం చాలని ఎక్సుజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వారు ఇచ్చే నివే దిక ఆధారంగా సంబంధిత అధికా రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అ దేవిధంగా ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చా మని మంత్రి తెలిపారు. ఎక్కువ మంది ఇం దిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు మం జూరు చేయాలని కోరుతున్నారని పేర్కొ న్నా రు. ధరణి సమస్యలు, పాస్ పుస్తకాల ఇ ష్యూపై ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను అరులైన లబ్ధిదారులకు మంజూరు చేస్తామ ని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు.