26-12-2025 12:34:57 AM
మేడిపల్లి, డిసెంబర్ 25 (విజయక్రాంతి): గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గురువారం మేడిపల్లి పోలీసులతో కలిసి ఈగల్ ఫోర్స్, ఆర్.ఎన్.పి.ఎస్ బృందం నిర్వహించిన ఆపరేషన్లో గుండ్ల పృథ్వీరాజ్, టి. రా హుల్, మహ్మద్ అక్రమ్, అబ్దుల్ షఫీ లను అరెస్ట్ చేసి 3 కిలోల గంజాయి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.చెంగిచర్లకు చెందిన పృథ్వీరాజ్ (27) సులభంగా డబ్బు సంపాదించడానికి ఒడిశా నుంచి గంజాయి ని తెచ్చి హైదరాబాద్లో అ మ్మడం ప్రారంభించాడు.
గతంలో పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లి విడుదలై వచ్చిన తర్వాత ఒడిశాకు చెందిన జశ్వంత్ తో కలిసి ముగ్గురిని అనుచరులుగా పెట్టు కొని మళ్ళీ దందాను మొదలుపెట్టాడు. అ బ్దుల్ షఫీ విజయనగరం వెళ్లి ఒడిశాకు చెందిన జశ్వంత్ దగ్గర 5 కిలోల గంజాయిని సేకరించి అక్రమ్కు అప్పగించాడు. అక్రమ్ ఈ నెల18న కొంత గంజాయిని విక్రయించ గా, మిగిలిన 3 కిలోలను గురువారం అమ్ముతుండగా పోలీ సులు వీరిని పట్టుకొన్నారు.