26-12-2025 02:26:32 AM
వేములవాడ, డిసెంబర్ 25,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవా డలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి అనుబంధ అలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరంగల్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకొని భక్తిశ్రద్ధలను వ్యక్తం చేశారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీకి ఆలయ ఈఓ ఎల్. రమాదేవి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మం డపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి వేదోక్త ఆశీర్వచనం అంద జేశారు.ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్సీకి అందజేశారు.