calender_icon.png 26 December, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

26-12-2025 02:23:29 AM

  1. చర్చిలకు క్రిస్మస్ కళ

జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు

రంగారెడ్డి/ చేవెళ్ల, డిసెంబర్ 25(విజయక్రాంతి): క్రిస్మస్ వేడుకలను జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేకంగా చర్చిలకు విద్యుత్ అలంక రణ తోపాటు క్రిస్మస్ ట్రీ,శాంటా తాతను పోలిన బొమ్మలను అలంకరించారు.

వేడుకల్లో భాగంగా జిల్లాలోని షాద్నగర్, ఆమన గల్ బ్లాక్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్‌లోని పలు చర్చిల్లో నిర్వహించిన వేడుకలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తెల్లవారుజాము నుంచే చర్చిలకు పైసవ సోదరులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఆటపాటలు ఆధ్యాత్మిక గీతాలు ద్వారా ఫీజు బోధనలను ఆలంపించారు. 

చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్ పల్లి తదితర మండలాల్లో వేడుకలు జరిగాయి.  చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద వార్డులో నూతన అపోస్తులిక చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అంతకుముందు భక్తులు ర్యాలీగా గ్రామంలోని వీధుల గుండా నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుతూ వచ్చారు. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎవాంజిలిస్ట్ బోడ అంజయ్య భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఏసు క్రీస్తు జన్మ వెనుక ఉన్న అసలు సందేశాన్ని వివరించారు. ప్రేమ, క్షమ, త్యాగం, మానవత్వం వంటి విలువలు ఈ ప్రపంచానికి ఎంత అవసరమో ఆయన తన  ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. సమాజంలో పెరుగుతున్న ద్వేషం, అసహనం మధ్య క్రిస్మస్ పండుగ మనకు శాంతి మార్గాన్ని చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

మాడుగుల మండలంలోని బ్రాహ్మణపల్లి కల్వకుర్తి చర్చల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం క్రిస్మస్ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళితో ఆనందం నింపిన క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమని ఆయన కొనియాడారు.

వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి

ఘట్‌కేసర్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : క్రిస్మస్ సందర్భంగా ఏసుక్రీస్తు జన్మదినాన్ని జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్, పోచారం సర్కిల్స్ లోని క్రైస్తవులు గురువారం వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్బంగా చర్చీలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి చర్చీలల్లో క్రైస్తవులు కుటుంబ సమేతంగా హాజరై ప్రార్ధనలు చేశారు. చర్చీలల్లో ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు జరిపి అనంతరం ఏసుక్రీస్తు ప్రవచనాలను తదివి వివరించారు.

చర్చీల ఆవరణలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ, క్రీస్తు జనన వృత్తం, బొమ్మల అలంకరణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఘట్ కేసర్ పట్టణంలోని గూస్పల్ లోకల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైస్తవులు అంటే స్నేహభావం, సేవాభావం కలిగి ఉంటారని, ఏసుప్రభు ప్రతి ఒక్కరికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ సర్కిల్ బిఆర్‌ఎస్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగరావు, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులుగౌడ్, బేతాళ నర్సింగరావు, గూస్పల్ చర్చ్ అధ్యక్షులు బొట్టు కృపానిధి, నాయకులు బద్దం జగన్ మోహన్ రెడ్డి, కందకట్ల రాధాకృష్ణరెడ్డి, ప్రసన్న ఎండి సిరాజ్ పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్

వికారాబాద్, డిసెంబర్-25: వికారాబాద్ జిల్లాలో గురువారం క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. స్థానికంగా ఉన్న చర్చిల్లో కుటుంబసమేతంగా వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఆ దేవున్ని స్తుతించారు. చర్చిల్లో పండుగ విశిష్టతను, ఏను ప్రభువు మహాత్యాన్ని, క్రిస్మస్ పండుగ నందేశాన్ని ఫాస్టర్లు భక్తులకు వివరించారు.. అనంతరం పాస్టర్లు క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి పలువురు భగవంతుని పాటలు ఆలపించారు ఆనంతరం కేక్ కట్ చేసి తినిపించుకుని క్రిన్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

వికారాబాద్‌లో జరిగిన సంబురాల్లో భాగంగా మెథడిస్టు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన ఏసు జీవితం అందరికి ఆదర్శమన్నారు. ఏసు క్రీస్తు పుట్టింది డిసెంబర్ నెలలోనే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి పుట్టింది కూడా డీసెంబర్ లోనేనన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుతో ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయ్యింది కూడా డిసెంబర్ లోనేనని, శాసనవ్యవస్థలో అత్యున్నతమైన స్పీకర్ పదవి బాధ్యతలు నేను స్వీకరించింది డిసెంబర్ నెలోనే అన్నారు. ఆనంతరం మాజీ ఎమ్మెలే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ప్రేమను పంచమని ఏసుక్రీస్తు మానవాళికి బోధించారన్నారు. బైబిల్ ప్రపంచానికి శాంతి వందేశాన్ని అందిస్తుందన్నారు.

ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన ఏను జీవితం అందరికి ఆదర్శమన్నారు. అనంతరం ఫాస్టర్ సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషన్ నాయక్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నుదాకర్రెడ్డి, మండల పార్టీ ఆధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పటేల్, నాగేందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గోపాల్ క్రైస్తవ సోదరులు ఉన్నారు.

జవహర్‌నగర్‌లో 

జవహర్ నగర్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్ గారి నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ శుభసందర్భాన్ని పురస్కరించుకొని మల్లారెడ్డి కేక్ కట్ చేసి అక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

వేడుకల్లో ప్రత్యేకంగా మాజీ మేయ ర్ మేఖల కావ్య, అలాగే బీఆర్‌ఎస్  ముఖ్యనాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. సామాజిక విలువ లు, మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండు గ నిలుస్తుందని మల్లారెడ్డి తెలిపారు. అనంతరం ప్రజల సమస్యలు, అభ్యర్థనలను తెలు సుకుని సమగ్ర దృష్టితో పరిష్కారం చేయాల్సిన పిలుపునిచ్చారు.

ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి

తుర్కయంజాల్, డిసెంబర్ 25: తుర్కయంజాల్ డివిజన్ పరిధిలోని కమ్మగూడ లోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం (చర్చి)లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వ హించారు. టీపీసీసీ సభ్యుడు, మాజీ కౌన్సిలర్ కాకుమాను సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ కేకు కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పాస్టర్ జయరాం రెడ్డి నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రంగారెడ్డి మాట్లాడుతూ దేవుడి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్ రెడ్డి యాదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ కొశికె ఐలయ్య, నాయకులు గుండ్లపల్లి ధన్ రాజ్ గౌడ్, సామ భీం రెడ్డి, మేతరి దర్శన్, రేవల్లి యాదగిరి, నారని శేఖర్ గౌడ్, పొలిశెట్టి ప్రేమ్ కుమార్, కాసు ఆరోగ్య రెడ్డి,  వెంకట్ రావు పాల్గొన్నారు.

పెద్ద అంబర్‌పేట్‌లో 

అబ్దుల్లాపూర్ మెట్, డిసెంబర్ 25: భువనేశ్వరినగర్ కాలనీలోని చర్చి పాస్టర్  హేమలత రవి, నిరీక్షణ ప్రార్థన మందిరం పాస్టర్ జూన్‌పాల్ ఆహ్వానం మేరకు క్రిస్మస్ వేడుకలకు స్థానిక నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యంజాల ప్రహ్లాద్, మాజీ కౌన్సిలర్ జగన్, పెద్ద అంబర్ పేట్ సర్కిల్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పరమేశ్వరి సంజీవ, మైత్రి శ్రీపురం కాలనీ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.