26-12-2025 12:38:16 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు ఉల్లంఘించి, రోడ్లెక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. బుధవారం అర్ధరాత్రి బంజారాహిల్స్ టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన యువకులకు అక్కడికక్కడే కౌన్సెలింగ్ ఇచ్చారు. వేడుకల దృష్ట్యా నగరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్మెంట్ డ్రైవ్ కొనసాగుతున్నదని చెప్పారు.