calender_icon.png 26 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి సామరస్యానికి ప్రతీక క్రిస్మస్

26-12-2025 12:29:35 AM

  1. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు 

సంగారెడ్డి, డిసెంబర్ 25 :క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని పలు చర్చిలలో నిర్వహించిన వేడుకల్లో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. మొదటగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆసుపత్రి సిబ్బంది, పేషంట్ల సమక్షం లో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంగారెడ్డిలోని మెథడిస్ట్ చర్చ్, సిఎస్‌ఐ చర్చ్, రాక్ చర్చ్, హోసన్న చర్చ్, సౌందర్య సీయోను చర్చ్ లలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె చర్చిలలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మత పెద్దలు, పాస్టర్ లతో కలసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. చర్చి పెద్దలు నిర్మలా జగ్గారెడ్డిని సన్మానించారు.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రేమ, శాంతి, సౌహార్ద్రతకు ప్రతీక అయిన క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఐక్యతతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జార్జ్, క్రిస్టియన్ కో ఆర్డినేటర్ మధు, నాయకులు కూన సంతోష్, చర్చి ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.