calender_icon.png 24 September, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తో రైతు మృతి

24-09-2025 07:35:30 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన శేకేల్లి రాజు( 40) తన పొలం వద్ద బోర్ మోటార్ సమీపంలో గ్రాస్ కటింగ్ మిషన్‌తో గడ్డి కోస్తుండగా, విద్యుత్ తీగ తెగిపడి యంత్రానికి తగలడంతో విద్యుత్ షాక్ తగిలి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సతెల్లి రాజు బుధవారం ఉదయం తన వ్యవసాయ బావి దగ్గర గ్రాస్ కటింగ్ తో గడ్డి కట్ చేస్తుండగా ప్రమాద వశత్తు బోర్ మోటారుకు ఉన్న వైర్ కు గ్రాస్ కట్టర్ తగలడంతో రాజుకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికి అక్కడే మృతి చెందినట్టు తెలిపారు. భార్య శేకెళ్లి శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేటున్నట్టు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.