calender_icon.png 24 September, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అపోహలు వీడి అవయవ దానానికి ముందుకు రావాలి: సీఐ హనూక్

24-09-2025 07:39:21 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రజలు అపోహలు వీడి నేత్ర, అవయవ దానానికి ముందుకు రావాలని బెల్లంపల్లి రూరల్ సిఐ హనూక్ కోరారు. బుధవారం బెల్లంపల్లి మండలంలోని బుధ కుర్దు గ్రామంలో ఇటీవల ఎద్దు దాడిలో మృతి చెందిన జంగపల్లి రాజారాం సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రతి మనిషికి మరణం తప్పదని, జీవించినప్పుడే ఇతరులకు సహాయపడాలని కోరారు.

మరణించిన జంగపల్లి రాజారాం నేత్ర దానం ద్వారా మరణించి జీవిస్తున్న వారి నేత్రాల ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారని చెప్పారు. రాజారామ్ స్ఫూర్తితో ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని కోరారు. అనంతరం రాజారామ్  కుటుంబ సభ్యులను  అభినందించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ టి. మల్లేష్, జనహిత సభ్యులు భీమిని కనకయ్య లు నేత్రదానానికి ముందుకు రావడంతో వారికి అభినందన పత్రాలు అందజేశారు.