13-12-2025 12:00:00 AM
బెల్లంపల్లి, డిసెంబర్ 12 : సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం శుక్రవారం ముగిసింది. గత పది రోజులుగా ఎన్నికల ప్రచా రం హోరాహోరీగా సాగింది. ఎన్నికల ప్రచా రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రధాన పార్టీల మధ్య ప్రచారం యుద్ధాన్ని తలపించింది. బెల్లంపల్లి నియోజక వర్గంలోనీ బెల్లంపల్లి, కాసిపేట తాండూరు, బీమినీ, నెన్నెల, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రధాన పార్టీ లు బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉన్నా రు.
నియోజకవర్గంలో 334 సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు 2001 మంది అభ్య ర్థులు బరిలో ఉన్నారు. ఇందులో సర్పంచ్ 2, వార్డు సభ్యులు 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1 స్థానానికి ఎన్నిక లేదు. ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్న రీతిలో ఇంతవరకు ప్రచారంలో తలపడ్డారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విపరీతంగా మద్యం, డబ్బులను పోటా పోటీగా పంపిణీ చేశారు.
ప్రతి మండలంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యనే బిగ్ వార్ నెలకొన్నది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చివరంకములో చేరి ప్రచారం చేశారు. అన్ని మండలాల్లో ప్రచారం చేయలేదు. ఆయా మండలాల లీడర్లు మాత్రం అభ్యర్థుల విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోన్నారు. ఇద్దరు బడా నేతలు ప్రచారంలో అంతగా పాల్గొన లేకపోవడం అభ్యర్థుల్లో అసంతృప్తి కనిపించింది.
తమ అభ్యర్థుల గెలుపును ఆయా మండలాల లీడర్లకి వదిలేసినట్టు కనిపిస్తోంది. ప్రచార ముగింపు క్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. అదికూడా అన్ని మండలాల్లోనూ ప్రచారం చేయలేదు. అంతగా సీరియస్‌గా ఈ ఎన్నికల ప్రచారాన్ని పట్టించుకోలేదు.
14న ఎన్నికలు..
మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. రెండో విడ త బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ఘట్టం తలపెట్టారు. ఈ నెల 14 పోలింగ్ జరగనున్నది. అందుకోసం అధికారులు ఏర్పా ట్లు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. ఈ. ఎన్నికల్లో 1,39,275 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 996 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇందు లో 30 సమస్యాత్మక కూలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఫలితాలు కూడా ప్రకటి స్తారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో మొత్తం స్థానాలు 114, వార్డులు, పోటీచేస్తున్న వారు 111, సర్పంచ్ స్థానాలు 334, ఎన్నికలు జరిగే వార్డులు 873, అభ్యర్థులు 2001 బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం కౌంటింగ్ రోజు వెల్లడి కానున్నది.
ఎవరికి పట్టం కడుతారో అనే టెన్షన్ నెలకొన్నది. అభ్యర్థుల్లో సహితం ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్ ఎన్నికల నిర్వహ ణ సక్రమంగా జరిగేందుకు ఏర్పాట్లను పరిశీలించారు. రెండో విడతగా బెల్లంపల్లి నియోజకవర్గం లో ఈనెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలి..
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 14వ తేదీన జరగనున్న 2వ విడత పోలింగ్ నిర్వహణ కొరకు ఎన్నికల సామాగ్రిని కేటాయించిన ప్రకారం ప్రణాళికాబద్ధంగా పంపిణీ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన 2వ విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారస్వామి తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటింగ్, కౌంటింగ్ కొరకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందిని నియమించారనిపారు. ఈ నెల 13వ తేదీన అధికారులు నిర్దేశిత సమయానికి తమకు కేటాయించిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలలో రిపోర్టు చేయాలని, ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయించిన ఎన్నికల సామగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
2వ విడతలో భాగంగా ఈ నెల 14వ తేదీన జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని, కన్నేపల్లి, నెన్నెల, కాసిపేట, తాం డూర్, వేమనపల్లి మండలాలలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పోలింగ్, పోలింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో ఎన్నికలు సమర్ధవం తంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
వెబ్ కాస్టిం గ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడం జరుగుతుందని, ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియో గించాలని, అధికారులు, మీడియా ప్రతినిధులు అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.