08-10-2025 06:35:51 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవో అధ్యక్షునిగా సంద అశోక్ ఎన్నో పోరాటాలు చేసి ఉద్యోగులకు అండగా నిలిచారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు వనజ రెడ్డి అన్నారు. ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖలో సూపరింటెండెంట్ గా పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్ ను ఆమె బుధవారం స్థానిక సంఘ భవనంలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వనజ రెడ్డి మాట్లాడుతూ... సంద అశోక్ టీఎన్జీవో యూనియన్ ను బలోపేతం కోసం కృషి చేశారన్నారు. సుదీర్ఘకాలం పాటు అధ్యక్షునిగా పని చేశారని గుర్తు చేశారు.
అనంతరం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన వనజ రెడ్డిని టీఎన్జీవో యూనియన్ నాయకులు పుష్పగుచ్చం, మెమెంటో అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. నవీన్ కుమార్, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు శివ కుమార్, కార్యదర్శి రామరావు, టీఎన్జీవో యూనియన్ రాష్ట్ర బాధ్యులు తిరుమల రెడ్డి, సంఘ సభ్యులు రాజేశ్వర్, అరుణ్, శ్రీనివాస్, మేదరి నవీన్, కలీమ్, సోహాలు, రామ్ మోహన్, రజినీకాంత్, వివిధ శాఖల ఉద్యోగులు, సంఘ బాధ్యులు పాల్గొన్నారు.