22-07-2025 12:34:42 AM
గ్లామరస్ హీరోయిన్‌గానే కాకుం డా మహిళా ప్రాధాన్య సినిమాలు, యాక్షన్.. ఇలా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కీర్తి సురేశ్. అనతి కాలంలోనే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించడం ద్వారా ఆయా భాషల్లో తనదైన ముద్ర వేసిందీ మలయాళీ ముద్దుగుమ్మ. 2016లో ‘నేను శైలజ’తో తెలు గులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ బ్యూటీ తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షిం చింది.
ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో అభినవ సహజ నటి అనిపించుకోవ డమే కాక ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం తన ఖాతాలో వేసుకుంది. ఇందులో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. అయితే, హిట్లు, ప్లాపుల తో సంబంధం లేకుండా.. నచ్చిన స్క్రిప్టులను ఎంచుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోవడంతో అందిన విజయాలే! ఈ విజయాల పరంపర కొనసాగు తుండగానే నిరుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది కీర్తి సురేశ్. పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగా ఉంటోంది.
ఇన్నాళ్లు వైవిధ్యమైన పాత్రలతో అలరించిన ఈ అమ్మడు.. ఈసారి రిస్క్ చేసేందుకు సిద్ధ మైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ మూవీలో నటిస్తున్న విజయ్ దేవరకొండ త్వరలోనే ‘రౌడీ జనార్ధన’ సినిమాను ప్రారంభించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ వేశ్య పాత్రలో నటించ నుందట. ఇప్పటివరకు చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేసిన కీర్తి సురేశ్.. తాజాగా ఆమెకు మేకర్స్ ఆఫర్ చేసిన తరహా పాత్ర చేయలేదు! నటిగా ఎంత సక్సెస్ సాధించినా.. పలానా పాత్ర చేయలేకపోయా నన్న వెలితి ఉండకూడదను కుందో ఏమో కానీ, ఇప్పుడీ ఛాలెంజింగ్ రోల్ చేసేం దుకు సిద్ధమైన కీర్తి సురేశ్.