calender_icon.png 22 July, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా దగ్గర ఆయుధాల్లేవ్.. గూండాలు లేరు..గుండెల్లో అభిమానులే ఉన్నారు

22-07-2025 12:31:33 AM

ఐదు షోలు.. టికెట్ ధరల పెంపునకు అనుమతి  

హరిహర వీరమల్లు సినిమా పెయిడ్ ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపునకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు విషయాల్లో చిత్ర నిర్మాతకు అనుకూలంగా మన రాష్ట్రంలోనూ అనుమతి లభించింది. 23వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600 (జీఎస్టీ అద నం)గా నిర్ణయించారు. ఇక సినిమా విడుదలైన రోజు (జూలై 24) నుంచి ఇదే నెల 27వ తేదీ వరకు ఐదు షో (సాధారణ రోజుల్లో నాలుగు ఆటలు ప్రదర్శితమవుతాయి)లకు అనుమ తిచ్చింది. ఈ రోజుల్లో టికెట్ ధరలు మల్టీప్లెక్సుల్లో రూ.200 (జీఎస్టీ అదనం), సింగిల్ స్క్రీన్లలో రూ.150 (జీఎస్టీ అదనం) గా ఉండనున్నాయి. ఇక జూలై 28 ఆగస్టు 2వ తేదీ వరకు కూడా ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం ఆ రోజుల్లో టికెట్లు.. మల్టీప్లెక్సుల్లో రూ.150 (జీఎస్టీ అదనం), సింగిల్‌ల్స స్క్రీన్లలో రూ.106 (జీఎస్టీ అదనం)కి విక్రయించాలని సూచించింది. 

పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు, ఏ దయాకర్‌రావు నిర్మాత. జూలై 24న విడుదల కానున్న ఈ చిత్రబృందం హైదరాబాద్‌లో సోమవారం ఉదయం పాత్రికేయుల సమావేశం నిర్వహించి, రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటుచేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నటుడు బ్రహ్మానందం, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. 

ఈ రెండు కార్యక్రమా ల్లో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. “సినిమా గురించి మీడియాతో మాట్లాడకపోవడానికి నాకు పొగరో, అహంకారమో కారణం కాదు. సినిమా గురించి చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక సినిమా చేయడానికి ఆర్థికంగా, సృజనాత్మకత కోసం ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టిం ది. ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఏఎం రత్నం.

నిర్మాతలు కనుమరుగవువుతున్న ఈ సమయంలో ఒడిదుడుకులు తట్టుకొని నిలబడ్డారు. అలాంటి నిర్మాత ఇబ్బంది పడ కూడదని.. ఈ సినిమాను నేను నా భుజాలపైకి తీసుకున్నాను. ఈ సినిమా అనాథ కాదు.. నేనున్నానని చెప్పడానికి వచ్చాను. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రత్నం పేరును సీఎంకు ప్రతిపాదించాను. ‘భీమ్లానాయక్’ విడుదలైనప్పుడు అందరి సినిమాల టికెట్లు రూ.100ల్లో ఉంటే..

పవన్ సినిమా టికెట్‌ను రూ.10 చేశారు. నేనొక్కటే చెప్పాను.. మనల్ని ఎవడ్రా ఆపేది అని. డబ్బు, రికార్డుల కోసం కాదు.. ధైర్యం, సాహసం, న్యాయం కోసం నిలబడ్డాం. సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నేనేమీ కోరుకో లేదు. ఈ స్థాయిలో నిలబడినా, రాజకీయాల్లో పడిలేచినా కారణం అభిమానులే. నా దగ్గర ఆయుధాల్లేవ్, గూం డాలు లేరు. గుండెల్లో అభిమానులే ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లవుతోంది.

వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చేవ చావలేదు. నేనెప్పుడూ బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను. అందుకే ‘జానీ’ ఫెయిల్ అయినప్పుడు బంధాన్ని కాపాడుకునేందుకే నా రెమ్యూనరేషన్ తిరిగిచ్చేశాను. కొత్త కథలు చేసే అవకాశం ఉన్నా, అది పోతే అంద రం ఇబ్బంది పడతామని రీమేక్‌లు చేశా. మంచి సినిమా కోసం చూస్తున్నప్పుడు క్రిష్ ఈ కథ చెప్పారు. ‘నాటు నాటు’ పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కీరవాణి లేకపోతే ఈ సినిమా లేదు. 

ఆత్మవి శ్వాసంతో నిలబడ్డామంటే ఆయ న సంగీతమే కారణం. నెల రోజులుగా నిధి అగర్వాల్ ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఆ అమ్మాయి చూస్తే నాకే సిగ్గేసింది. అందుకే నేనూ ప్రెస్‌మీట్లలో పాల్గొంటున్నా” అన్నారు.  “పవన్‌కల్యాణ్‌తో నటించే అవ కాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా సినీ జీవితంలో ప్రత్యేకమైన చిత్రమిది” అని కథానాయిక నిధి అగర్వాల్ అన్నారు.  జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. “మా నాన్నలోని కసి, పవన్‌కల్యాణ్ కళ్లలోని ఫైర్..

నన్ను అవిశ్రాంతంగా పనిచేసేలా చేశాయి. ఛప్రతి శివాజీ ఉన్నంతకాలం ఔరంగ జేబుకు నిద్రపట్టలేదు. మొఘలుల నుంచి జ్యోతిర్లింగాలు, కాశీక్షేత్రాన్ని కాపాడటం, ధర్మస్థాపన కోసం ఓ యోధుడు చేసే పోరా టమే ఈ చిత్రం. ప్రతి శతాబ్దానికి ఒక ఛత్రపతి శివాజీ పుడతాడు. ఈ 21వ శతాబ్దానినికి పవన్‌కల్యాణ్ ఉండటం మన అదృష్టం.” అన్నారు.  నిర్మాత రత్నం మాట్లాడుతూ.. “పవన్‌కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలయ్యే తొలి సినిమా ఇది. నిర్మించినందుకు గర్వంగా ఉంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదిది.. ఆలోచింపజేసే సినిమా ఇది” అన్నారు.