08-10-2025 04:32:02 PM
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ కాన్పుల సంఖ్యను పెంచేలా గ్రామాల్లోని గర్భిణీలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లితో పాటు జాజిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయానుకూలంగా గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అన్ని రకాల వ్యాక్సిన్లు వేయాలని చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్, సీహెచ్ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, డాక్టర్ ఉదయ్, నర్సింగ్ ఆఫీసర్లు చొక్కయ్య, సునీత, మాధవి, అనుష, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.