calender_icon.png 8 October, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

08-10-2025 04:29:38 PM

కామారెడ్డి (విజయక్రాంతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్. గవాయిపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బుధవారం పంచాయతీ రాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం బ్లాక్ ప్రధాన కార్యదర్శి నిజ్జని శ్రీకాంత్ పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నత పదవిలో ఉన్న న్యాయమూర్తిపై దాడికి యత్నించడం అమానుషం అన్నారు. నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.