calender_icon.png 30 June, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొమ్మిదోమైల్ తండాలో ఘనంగా ఆషాడ మాస బోనాలు

29-06-2025 10:01:17 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం(Tekulapalli Mandal) తొమ్మిదోమైల్ తండా గ్రామంలో ఆదివారం ఆషాడ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బోనాల కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం ఉమా- సురేందర్ పాల్గొని గ్రామంలోని ఆడపడుచులతో కలిసి సందడిగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, బానోత్ భద్రు, పోషాలు, శివ, భూక్యా సర్దార్, రవి, తదితరులు పాల్గొన్నారు.