టీడీపీ ఇనుగుర్తి మండల కమిటీ ఎన్నిక
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండల తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. అధ్యక్షునిగా గుజ్జునూరి వెంకన్న, ఉపాధ్యక్షునిగా మల్లెపాక కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా జిలుగుల పుల్లయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా దుంపల సాంబయ్య ఎన్నికైనట్లు మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, టీడీపీ రాష్ట్ర పరిశీలకులు అనంత రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ కొండపల్లి రామచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్, ఉప్పలయ్య, ఓరుగంటి రామస్వామి, వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఓరుగంటి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇనుగుర్తి గ్రామ నూతన కమిటీ అధ్యక్షులుగా గంజి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చేట్టబోయిన బిక్షం ఎన్నికయ్యారు.






