calender_icon.png 24 October, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

39 మంది అయ్యప్ప భక్త స్వాములు మాలధారణ

22-10-2025 05:19:45 PM

టేకులపల్లి (విజయక్రాంతి): కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఇల్లందు శ్రీ హరి హర క్షేత్రం అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకులు ప్రదీపన్ శర్మచే టేకులపల్లి శ్రీ కోదండ రామాలయం అయ్యప్ప పీఠం 39 మంది అయ్యప్ప భక్త స్వాములు బుధవారం మాల ధరించారు. రామాలయం ప్రధాన అర్చకులు శ్రీరంగం అజయ్ సాయి చక్రిచే రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజ పీఠం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కన్నె, కత్తి, గంట, గద్ద, పేరు, గురుస్వాములు బాధవత్ మాన్సింగ్ స్వామి, బోడ మంగీలాల్ నాయక్ స్వామి, జయంత్ స్వామి, తేజవత్ కోటేష్ స్వామి, జాటోత్ శ్రీనివాస్ స్వామి తదితరులు పాల్గొన్నారు.