calender_icon.png 6 November, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి

06-11-2025 08:09:00 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వాంకిడి మండలం బంబర గ్రామంలోని ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి ఎన్. నాగేంద్ర రాష్ట్ర స్థాయి U/17 బాలుర కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 7, 8, 9 తేదీలలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి. లక్ష్మీ ప్రసన్న (PGHM), శారీరక విద్యా ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి నాగేంద్రను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి, పాఠశాల అధ్యాపక బృందం శుభాకాంక్షలు తెలియజేశారు.