calender_icon.png 6 November, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ప్రచారంలో కాటారం నాయకులు

06-11-2025 08:07:12 PM

కాటారం (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్ లో భాగంగా తెలంగాణ ఐటి మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి కాటారం మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐటి మినిష్టర్ శ్రీధర్ బాబుతో కలిసి కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఓటర్లు ప్రభావితులవుతున్నారని నాయకులు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాటారం మండల నాయకులు బీరెల్లి రజిని, పున్నం రమేష్, తదితరులు పాల్గొన్నారు.