calender_icon.png 6 November, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయిబాబా ఆలయంలో అన్నదానం

06-11-2025 08:10:20 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్ ఎదులబాద్ లోని సాయిబాబా ఆలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ గురువారం కాలేరు సురేందర్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదట భక్తులు ఆలయంలో సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు. భక్తజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో కాలేరు నవీన్, శ్రావణి, దేవి, పోత్నకని మల్లికార్జున్ రాజు, సామల వెంకటేష్, ఆముద నాగరాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.